మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్

మావోయిస్టు నేత దామోదర్ అరెస్ట్

ADB: మావోయిస్టు తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కా రావు అలియాస్ దామోదర్ పోలీసులకు పట్టుబడ్డారు. ఆదిలాబాద్ నుంచి సేఫ్ జోన్‌కు వెళ్తుండగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేసినట్లు సమాచారం. సిర్పూర్ (యూ)లో బడే చొక్కారావుతో పాటు మరో 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ వారిలో 9 మంది మహిళలు, 7 మంది పురుషులు ఉన్నారు.