కనిగిరి పట్టణంలో పర్యటించిన మున్సిపల్ చైర్మన్

ప్రకాశం: కనిగిరి పట్టణంలోని బోయపాలెంలో శుక్రవారం కురిసిన భారీ వర్షానికి రహదారుల పైకి, ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో స్థానికుల ఫిర్యాదు మేరకు మున్సిపల్ చైర్మన్ అబ్దుల్ గఫార్ అక్కడికి వెళ్లారు. ఇళ్లలోకి చేరిన వర్షపు నీటిని ఆయన పరిశీలించారు. బోయపాలెంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, నూతన కాలువలు నిర్మించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.