గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి

Vsp: విశాఖలోని ప్రముఖ పుణ్య క్షేత్రం సింహాచలం చందనోత్సవంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున కురిసిన భారీ వర్షానికి గోడ కూలిపోవడంతో క్యూలో ఉన్న భక్తులు ఏడుగురు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయపడ్డారని సమాచారం. తెల్లవారుజామున కుండపోతగా వర్షం కురుస్తుండటంతో భక్తులు తలదాచుకునేందుకు ఒక గోడ పక్కకు చేరారు.