H-1B వీసాదారులకు వెట్టింగ్ కష్టాలు
H-1B వీసా వెట్టింగ్ నిబంధనలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యంత్రాంగం మరింత కఠినతరం చేసింది. ఆ వీసాలకు దరఖాస్తు చేసుకునేవారి లింక్‌డిన్ పేజీలు, రెజ్యూమోలను సమీక్షించాలని దౌత్యవేత్తలను ఆదేశించింది. ఈ నెల 15 నుంచి ఈ సమీక్ష జరగనుంది. వాక్ స్వాతంత్య్రం అణచివేసేలా సెన్సార్‌షిప్‌ను గతంలో అమలు చేసిన వారి వీసాలను తిరస్కరించాలని పేర్కొంది.