యూరియా కోసం బారులు తీరిన రైతులు

MDK: రామాయంపేట మండలం అక్కన్నపేట రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గత 15 రోజులుగా యూరియా లేక ఇబ్బంది పడుతున్న రైతులు ఆదివారం లారీ రావడంతో విషయం తెలుసుకున్న రైతులు పెద్ద ఎత్తున రైతు వేదిక వద్ద యూరియా బస్తా కోసం బారులు తీరారు. రైతుకు ఒక బస్తా మాత్రమే యూరియా సరఫరా చేయడంతో తమకు యూరియా సరిపోవడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.