గుండ్లకుంటలో బాలల దినోత్సవ వేడుకలు

గుండ్లకుంటలో బాలల దినోత్సవ వేడుకలు

KDP: పెద్దముడియం మండలం గుండ్లకుంటలో డాక్టర్ బి.ఆర్. అంబేద్క‌ర్ గురుకుల పాఠశాలలో బాలల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించినట్లు ప్రిన్సిపాల్ సుజాత తెలిపారు. కార్యక్రమంలో జవాహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన వివిధ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.