మురికి కూపంలా పార్వతీపురం మున్సిపల్ షాపింగ్కాంప్లెక్స్

మురికి కూపంలా పార్వతీపురం మున్సిపల్ షాపింగ్కాంప్లెక్స్

పార్వతీపురం పట్టణంలోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ అభివృద్ధి చేయాలని స్థానికులు కోరుతున్నారు. పెచ్చులూడుతున్న స్లాబులు, పశువులు, బైక్ పార్కింగ్లకు అడ్డాగా మారిందని అద్దెదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు అద్దెలు వసూలపై పెట్టిన శ్రద్ధ.. అభివృద్ధిపై చూపడంలేదని మండిపడుతున్నారు. తక్షణమే అభివృద్ధి పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.