మినీ బ్రిడ్జికి పొంచి ఉన్న ప్రమాదం
KMR: బీబీపేట మండలం ఇస్సానగర్ గ్రామ లింక్ రోడ్డుపై గల మినీ బ్రిడ్జి పరిస్థితి దారుణంగా మారింది. బ్రిడ్జికి అనుసందానం చేసే అప్రోచ్ పై సొరంగంలా గుంత ఏర్పడింది. ఇంకా బ్రిడ్జి పిల్లర్ పునాది రాళ్లు కోతకు గురై కొట్టుకుపోయాయి. దీంతో అటుగా ప్రయాణించే వారు ప్రమాదం జరగక ముందే మరమ్మతులు జరిపి ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా చూడాలని కోరుతున్నారు.