ఆమిదాలగొంది పాఠశాలలో మాక్ అసెంబ్లీ
సత్యసాయి: ఆమిదాలగొంది ఉన్నత పాఠశాలలో బుధవారం భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాక్ అసెంబ్లీ ఏర్పాటు చేశారు. విద్యార్థులు అధికార పక్షం, ప్రతిపక్షంగా విడిపోయి, అసెంబ్లీ తరహాలో వ్యవహరించారు. ప్రజా సమస్యలు, ముఖ్యమైన అంశాలపై విద్యార్థులు చేసిన ప్రసంగాలు, చర్చలు అందరినీ ఆకట్టుకున్నాయి.