‘ఉచిత బస్సు పేరుతో ఆటో కార్మికుల పొట్ట కొట్టొద్దు'

‘ఉచిత బస్సు పేరుతో ఆటో కార్మికుల పొట్ట కొట్టొద్దు'

VZM: ఉచిత బస్సు పేరుతో ఆటో కార్మికుల పొట్ట కొట్టొద్దని సీఐటీయూ జిల్లా కార్యదర్శి బీవీ. రమణ డిమాండ్ చేశారు. మంగళవారం పార్వతీపురం పాత బస్టాండ్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నిరసన చేపట్టారు. ఎన్నికల్లో ఓట్ల కోసం అనాలోచిత పథకాలు అమలు చేసి కొంత మందికి మేలు చేస్తున్నప్పటికీ మరి కొంత మందికి తీవ్ర నష్టం చేకూర్చే హామీలు ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.