ఆటో బోల్తా.. ఎనిమిది మందికి గాయాలు
KDP: బి కోడూరు మండలం రాజుపాలెం గ్రామానికి వచ్చిన వ్యవసాయ కూలీలు ఆటోలో తిరిగి ఇంటికి వెళ్తుండగా బ్రేక్ ఫెయిల్ అయి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారంతా పోరుమామిళ్ల పట్టణం గిరి నగర్‌కు చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.