19 వరకు అభ్యంతరాల స్వీకరణ

ప్రకాశం: జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర పోస్టులకు సంబంధించి మెరిట్‌లిస్ట్‌ను సమగ్రశిక్ష ఒంగోలు కార్యాలయం నోటీస్‌బోర్డులో ఉంచారని డీఈవో కిరణ్‌కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. వీటికి సంబంధించిన అభ్యంతరాలను ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తామన్నారు. అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.