VIDEO: మురముళ్ళలో భారీగా ట్రాఫిక్ జామ్
కోనసీమ: ఐ.పోలవరం మండలం మురమళ్ళలో శ్రీ మాణిక్యాంబ అమ్మవారి తీర్థ మహోత్సవాలు శుక్రవారం వైభవంగా జరుగుతున్నాయి. అయితే, 216 జాతీయ రహదారికి ఆనుకుని గుడి ఉండడంతో ఆ రహదారిపై భారీగా వాహనాలు రావడంతో రెండు కిలోమీటర్లు మేర ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో బస్సులలో ఉక్కపోతతో ప్రయాణికులు అవస్తలు పడ్డారు. పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు.