పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి

పేరుపాలెం బీచ్‌లో పర్యాటకుల సందడి

W.G: మొగల్తూరు మండలంలో ఉన్న ప్రముఖ పర్యాటక కేంద్రం పేరుపాలెం బీచ్ ఆదివారం కావడంతో జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో పర్యాటకులు విచ్చేశారు. కుటుంబ సమేతంగా సముద్ర స్నానాలు చేస్తూ ఇసుక తిన్నెల మీద సరదాగా గడిపారు. అనంతరం తీరంలో ఉన్న ఆలయాలను సందర్శించి దర్శనాలు చేసుకున్నారు. మొగల్తూరు పోలీసులు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకున్నారు.