ఏసీబీ వలలో చిక్కిన వీఆర్వో

ఏసీబీ వలలో చిక్కిన వీఆర్వో

NLR: భూసమస్య పరిష్కారం కోసం వెళ్లిన రైతుల నుంచి లంచం కోసం వేధింస్తున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుపడ్డారు. రేజర్ల మండలం దొరువుపాడు గ్రామానికి చెందిన గంటా అంజిబాబు తన 1.53 ఎకరాల పట్టా భూమిని సరి చేయాలని వీఆర్వో వంశీప్రదీప్ కుమార్‌ను కోరగా  రూ.32వేలు డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని ఏసీబీ డీఎస్పీ అనిశా రామకృష్ణుడుకి తెలిపగా, ఆయన తమ బృందంతో కలిపి అదుపులోకి తీసుకున్నారు.