వివాదాలకు దూరంగా ఉండాలి: ఎస్సై

వివాదాలకు దూరంగా ఉండాలి: ఎస్సై

CTR: గ్రామాలలో చిన్నచిన్న వివాదాలకు ఘర్షణలు పడకుండా సంయమనం పాటించాలని చౌడేపల్లె ఎస్సై చిన్న రెడ్డప్ప సూచించారు. మదనపల్లి శక్తి బృందం ఆధ్వర్యంలో మండలంలోని బోయకొండలో పలు అంశాలపై అవగాహన కల్పించారు. టీనేజ్ ఆకర్షణలకు లోనైతే భవిష్యత్తు శూన్యమవుతుందన్నారు. ఆన్ లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్తు పదార్థాల వినియోగంతో పలు దుష్ప్రభావాలు ఉన్నాయన్నారు.