ప్రసూతి ఆసుపత్రిలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

ప్రసూతి ఆసుపత్రిలో కలెక్టర్‌ ఆకస్మిక తనిఖీ

HNK: జిల్లా ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిని కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని ఓపీ విభాగం, ఫార్మసీ, లేబర్ రూమ్, వార్డులను ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో నెలకొన్న అపరిశుభ్రతపై కలెక్టర్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పారిశుధ్య లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.