అమరావతి ఆంధ్ర ప్రదేశ్ శాశ్వత రాజధాని: కలెక్టర్
NDL: అమరావతికి శాశ్వత రాజధానిగా చట్టబద్ధత లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక మహత్తర ఘట్టంగా నిలిచిందని కలెక్టర్ జి.రాజకుమారి పేర్కొన్నారు. గురువారం నంద్యాల కలెక్టరేట్ ఆవరణలో జిల్లా యంత్రాంగం సమష్టిగా పాల్గొని వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఆవరణ ముందు భాగాన్ని ఆకర్షణీయంగా రంగవల్లికలతో, దీపాలతో అలంకరించారు. కలెక్టర్ జ్యోతి వెలిగించి, కేక్ కట్ చేసి వేడుకలను జరిపారు.