రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు

రోడ్డు ప్రమాదాల నివారణకు వాహన తనిఖీలు

కృష్ణా: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణ, అక్రమ రవాణా అడ్డగింపు అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు జిల్లా పోలీసులు ఆదివారం రాత్రి ప్రత్యేక వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని రకాల వాహనాలను ఆపి, తనిఖీలు చేసి డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, పొల్యూషన్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలించారు, హెల్మెట్ లేని వారికి చలానాలను విధించారు.