ఉమ్మడి జిల్లా జడ్పీ సర్వసభ్య సమావేశం
KRNL: జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా, విద్యా శాఖ, ప్రజా పంపిణీ వ్యవస్థ, 2026-27 అంచనా బడ్జెట్‌పై సమగ్ర చర్చలు జరిపారు. జిల్లా కలెక్టర్లు, ఎమ్మెల్యేలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.