కవిత వ్యాఖ్యలపై స్పందించిన మంత్రి కోమటిరెడ్డి

NLG: BRS ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం స్పందించారు. BRS పార్టీలో ఆధిపత్యం కోసం పోటీ నడుస్తోందని ఆరోపించారు. ఈ క్రమంలో కల్వకుంట్ల ఇంటి పంచాయితీలోకి CM రేవంత్ రెడ్డిని లాగొద్దని ఆయన హెచ్చరించారు. CM రేవంత్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. CBI దర్యాప్తులో దోషులు తేలుతారని మంత్రి అన్నారు.