2027 జనాభా లెక్కలు దేశాభివృద్ధికి కీలకం: కలెక్టర్
SRPT: 2027 జనాభా గణన దేశాభివృద్ధికి, పథకాల అమలుకు అత్యంత కీలకమని కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన, తొలిసారిగా డిజిటల్ విధానంలో గణన జరుగుతుందని పేర్కొన్నారు. మే 11 నుంచి జూన్ 9 వరకు మొదటి దశ ఇళ్ల జాబితా నమోదు ఉంటుందని కలెక్టర్ అన్నారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు ఉన్నారు.