'దరఖాస్తుకు నవంబర్ 5 వరకు చివరి అవకాశం'
BDK: జిల్లా యువత ఫర్నిచర్ తయారీ రంగంలో నైపుణ్యాలను అలవర్చుకుని ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఇవాళ పిలుపునిచ్చారు. NSTI-FFSC, ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న మూడు నెలల ఫర్నిచర్ అసిస్టెంట్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్‌లో పాల్గొనదలచిన అభ్యర్థులు నవంబర్ 5, 2025లోపు నమోదు చేసుకోవాలని సూచించారు.