VIDEO: ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు
MDK: జిల్లా కలెక్టరేట్‌లో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను శనివారం నిర్వహించారు. తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు తమ ఆటపాటలతో సభా ప్రాంగణంలో ఉత్తేజం నింపారు. కలెక్టర్ ప్రతిమా సింగ్, అదనపు కలెక్టర్ నగేష్, మున్సిపల్ ఛైర్మన్ రాధికా భూపతి రాజు, వైస్ చైర్మన్ నరేష్ పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.