గిద్దలూరులో విద్యార్థులకు వేసవి తరగతులు

NDL: సంజామల మండలం గిద్దలూరు పుస్తక నిక్షిప్త కేంద్రంలో విద్యార్థులకు నిర్వాహకులు టి.మద్దిలేటి ఆధ్వర్యంలో సమ్మర్ ఓరియంటేషన్ తరగతులు కొనసాగుతున్నాయి. శనివారం విద్యార్థులకు కాపీ రైటింగ్, కథల పుస్తకాలు చదివించడం, చెస్, తదితర క్రీడా పోటీలను నిర్వహించారు. ఇందులో గంట సేపు సమయం కేటాయించిన విద్యార్థులకు లక్కీ డిప్ ద్వారా బహుమతులు, బిస్కెట్లు అందజేశారు.