ఈనెల 29న మెగా జాబ్ మేళా

ఈనెల 29న మెగా జాబ్ మేళా

W.G: భీమవరం SRKR ఇంజినీరింగ్ కళాశాల వేదికగా ఈనెల 29న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఈ మేరకు కలెక్టరేట్లో గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. ఈ డ్రైవ్‌లో 28కి పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని, సుమారు 3000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వెల్లడించారు. జిల్లాలోని అర్హులైన యువతీ యువకులు పాల్గొనాలని కోరారు.