ప్రేమ పేరుతో లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

ప్రేమ పేరుతో లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

AKP: నర్సీపట్నం బలిఘట్టం గ్రామానికి చెందిన ఒక మైనర్ మీద జరిగిన అత్యాచార కేసులో నిందితుడి మీద ఫోక్సో కేసు నమోదు చేసి అరెస్టు చేశామని టౌన్ సీఐ షేక్ గఫూర్ తెలిపారు. గత ఏడాది అక్టోబర్ నెలలో బాలికను పెద్దబొడ్డేపల్లికి చెందిన 20 ఏళ్ల యువకుడు ప్రేమ పేరుతో కిడ్నాప్ చేశాడన్నారు. విజయవాడలో పలుమార్లు లైంగిక దాడి చేయడంతో బాలిక గర్భం దాల్చిందన్నారు.