దుగ్గిరాలలో టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి

GNTR: స్వాతంత్య్ర సమరయోధుడు, ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు జయంతి వేడుకలు శనివారం దుగ్గిరాలలో ఘనంగా నిర్వహించారు. పంచాయతీ కార్యాలయం, బాలికల హైస్కూల్‌లో నిర్వహించిన కార్యక్రమాల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ షేక్ జబీన్, ఎంపీడీఓ ఏ.శ్రీనివాస రావు పాల్గొన్నారు.