ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంత ఇంటి కల సాకారం!

ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంత ఇంటి కల సాకారం!

VKB: పెద్దనందిగామలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లను సర్పంచ్ చెన్ బస్ కుమార్, మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సొంత ఇంటి కలను నిజం చేస్తోందని కొనియాడారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి అందుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఉషశ్రీ, తదితరులు పాల్గొన్నారు.