వింజమూరులో అన్న క్యాంటీన్ ప్రారంభం
NLR: వింజమూరు బంగ్లా సెంటర్ వద్ద అన్న క్యాంటీను ఎమ్మెల్యే కాకర్ల సురేష్, వక్స్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ బుధవారం ఘనంగా ప్రారంభించారు. నిరుపేదలు, కూలీలు, మధ్యతరగతి ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన భోజనం అందించడమే లక్ష్యమని వారు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు సీఎం చంద్రబాబు కృషి చేశారని కొనియాడారు.