మన్సుఖ్ మాండవీయని కలిసిన ఎంపీలు

మన్సుఖ్ మాండవీయని కలిసిన  ఎంపీలు

AP: కేంద్ర క్రీడా, యువజన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో టీడీపీ MPలు భేటీ అయ్యారు. MPలు లావు శ్రీకృష్ణదేవరాయలు, సానా సతీష్ ఆయనతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో క్రీడా మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలని విన్నవించారు. రాష్ట్రంలో నేషనల్ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ఖేలో ఇండియా ప్రాజెక్టుల పూర్తికి గ్రాంట్ విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.