తిరుమల కొండల్లో కారుచిచ్చు

తిరుమల కొండల్లో కారుచిచ్చు

తిరుమల కొండల్లో కాకులమాను దిబ్బ ప్రాంతంలో మంటలు చెలరేగడం ఆందోళన కలిగించింది. విండ్ మిల్స్ సమీపంలో మంటలు ఎగిసిపడుతుండడంతో ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని అదుపులోకి తెచ్చారు. వేసవిలో ఇక్కడ తరచుగా మంటలు సంభవిస్తుంటాయి. దీనివల్ల వృక్షసంపద, వన్యప్రాణులకు హాని కలుగుతూ ఉంటుంది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా టీటీడీ, అటవీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని నెటిజెన్స్ కోరారు.