రైళ్ల‌లో బాణ‌సంచా త‌ర‌లింపు నిషేధం

రైళ్ల‌లో బాణ‌సంచా త‌ర‌లింపు నిషేధం

VSP: రైళ్ల‌లో బాణ‌సంచా ర‌వాణా అరిక‌ట్టేందుకు నిఘా పటిష్టం చేశామ‌ని విశాఖ రైల్వే అధికారులు గురువారం తెలిపారు. దీపావళి పండుగ సీజన్ సమీపిస్తుండటంతో, వాల్తేరు డివిజన్ రైళ్లలో టపాసులు , ఇతర మండే వస్తువుల రవాణాను నిరోధించడానికి తన భద్రతా చర్యలను తీవ్రతరం చేశామ‌న్నారు. ఎవ‌రైనా బాణ‌సంచా త‌ర‌లిస్తే కేసులు న‌మోదు చేసి అరెస్టు చేస్తామ‌ని హెచ్చ‌రించారు.