ALERT: రాష్ట్రానికి మరో తుఫాన్
AP: అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాబోయే 48 గంటల్లో మరింత బలపడే ఛాన్స్ ఉందని వాతావరణశాఖ వెల్లడించింది. రేపటి నుంచి మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు వెంటనే తిరిగి రావాలని సూచించింది. మరోవైపు నైరుతి బంగాళాఖాతం, దక్షిణ శ్రీలంక, హిందూ మహాసముద్రం మీదుగా మరో అల్పపీడనం కేంద్రీకృతమైందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.