‘రూమర్లను నమ్మొద్దు.. దేశంలో ఇంధన కొరత లేదు’
దేశంలో చమురు, గ్యాస్ కొరత లేదని, ప్రజలు నిశ్చింతగా ఉండాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అనవసరపు పుకార్లతో భయాందోళన చెందవద్దని, ప్రభుత్వాన్ని నమ్మాలని కోరారు. పెట్రో ధరలపై ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించి సంక్షోభ భారాన్ని భరిస్తున్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని పేర్కొన్నారు. భారత్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటుందని, యుద్ధాల జోలికి వెళ్లబోమని తేల్చి చెప్పారు.