VIDEO: 'కోనేరు చుట్టూ ఫెన్సింగ్, లైట్లు ఏర్పాటు చేయాలి'
JGL: కొండగట్టు ఆంజనేయ స్వామి సన్నిధిలో జరుగనున్న చిన్న జయంతి ఉత్సవాల ఏర్పాట్లను ఇవాళ పరిశీలించడానికి వచ్చిన కలెక్టర్ సత్యప్రసాద్ కోనేరు పరిసర ప్రాంతాల పరిస్థితిని చూసి అసహనం వ్యక్తం చేశారు. కోనేరు పరిసర ప్రాంతాల్లో దుర్వాసన రాకుండా చూడాలని, నీటిని తరచూ మార్చాలని, కోనేరు చుట్టూ ఫెన్సింగ్, లైట్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.