మహిళల సాధికారతే లక్ష్యం: ఎమ్మెల్యే

మహిళల సాధికారతే లక్ష్యం: ఎమ్మెల్యే

మేడ్చల్: మహిళల సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని కూకట్‌పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. నేడు బేగంపేట డివిజన్ మాతాజీ నగర్‌లో 100 మంది మహిళలకు కుట్టు మిషన్లు, సర్టిఫికెట్లు పంపిణీ చేశారు. ఇప్పటికి నియోజకవర్గ వ్యాప్తంగా 2500 మందికి పంపిణీ చేశామని, శిక్షణ అందించామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఇది కొనసాగుతుందని వివరించారు.