వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
MDK: పాపన్నపేట మండలం నాగసాన్ పల్లిలో వెలిసిన శ్రీ ఏడుపాయల క్షేత్రంలో శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. వన దుర్గ భవాని మాతకు పంచామృతాలు, మంజీరా నది పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. పలు ద్రవ్యాలు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించి సుగంధ పుష్పాలతో అలంకరించారు. కుంకుమార్చన, మంగళహారతి నైవేద్యం నివేదన చేశారు.