VIDEO: చందనోత్సవంలో సామాన్య భక్తులకు పెద్దపీట

VSP: ఈనెల 30వ తేదీన జరగనున్న శ్రీ సింహాచలం అప్పన్న దివ్య క్షేత్రంలో చందనోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు హోం మంత్రి అనిత వెల్లడించారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తామని ఆమె తెలిపారు. ఆదివారం సింహాచలంలో జరుగుతున్న ఏర్పాట్లను ఆమె పరిశీలించారు. వృద్ధులు, దివ్యాంగులు, చంటి పిల్లలకు లిఫ్ట్‌లో తీసుకెళ్లి మరీ దర్శనాలు చేయిస్తామన్నారు.