త్వరలో HYD నగరానికి మరిన్ని ఎలక్ట్రిక్ బస్సులు
HYDలో విద్యుత్ బస్సుల వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో డ్రైవర్ల కొరత సమస్యగా మారుతోంది. హకీంపేటలో శిక్షణ పొందుతున్న వారిలో కేవలం 30 శాతం మంది మాత్రమే అర్హత సాధిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో నగరానికి 175కి పైగా కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానుండటంతో డ్రైవర్ల అవసరం మరింత పెరుగనుంది. దీంతో RTC సమస్య పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది.