ప్రమాదానికి ఆమడ దూరంలో రహదారి కల్వర్టు
NDL: అవుకు మండలం సింగనపల్లి నుంచి ఓబులాపురం వెళ్లే రహదారిలో నిర్మించిన కల్వర్టు కుంగిపోయి భారీ రంధ్రం ఏర్పడింది. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారిపై కల్వర్టు కుంగిపోవడంతో వాహనం ఏమాత్రం అదుపు తప్పినా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. రాత్రి వేళల్లో ఈ గుంత కనిపించక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు స్పందించి కల్వర్టుకు మరమ్మతులు చేపట్టాలన్నారు.