కలెక్టరేట్ వద్ద యువరైతు ఆత్మహత్యాయత్నం
వికారాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద ఓ యువరైతు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. యువరైతు 20 గుంటల భూమి కోసం రెండేళ్లుగా అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్నాడు. మనస్తాపం చెందిన అతను కలెక్టరేట్ ప్రధాన గేటుపైకి ఎక్కి, ఉరి వేసుకుంటానని హల్‌చల్ చేశాడు. వెంటనే అప్రమత్తమైన కలెక్టరేట్, పోలీసు సిబ్బంది అతన్ని గేటుపై నుంచి దించారు.