ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

ఘనంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనం

NZB : ముప్కాల్ మండల కేంద్రంలోని ఒక గార్డెన్లో ఆదివారం 1993-94 బ్యాచ్ పదో తరగతి పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సుమారు 33 ఏళ్ల తర్వాత ఒకరినొకరు కలుసుకున్న మిత్రులు పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సత్కరించారు. వివిధ రంగాల్లో స్థిరపడిన విద్యార్థులు ఇందులో పాల్గొని సందడి చేశారు.