నిరుపయోగంగా గజ్వేల్ ఆర్టీసీ బస్టాండ్..!
SDPT: గజ్వేల్ పట్టణంలోని తూప్రాన్ రోడ్డులో రూ.6 కోట్ల వ్యయంతో ఆరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన బస్టాండ్ నిరుపయోగంగా మారింది. గత ప్రభుత్వ హాయాంలో నిర్మించిన ఈ బస్టాండ్ గజ్వేల్ పట్టణానికి దాదాపుగా కిలోమీటరున్నర దూరంలో ఉండడంతో ప్రయాణికులు, ఆర్టీసీ బస్సులు అక్కడికి వెళ్లడం లేదు. ఈ మేరకు బస్టాండ్‌ను ఇతర అవసరాలకు వినియోగించాలని స్థానికులు కోరుతున్నారు.