VIDEO: 'మా సార్ మాకే కావాలి'.. విద్యార్థుల ధర్నా. !
SDPT: చేర్యాల మండలం ఆకునూరు జడ్పీ ఉన్నత పాఠశాలలో హిందీ పండిట్‌ను వేరే పాఠశాలకు బదిలీ చేయడాన్ని నిరసిస్తూ విద్యార్థులు మంగళవారం రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. ఇద్దరు ఉపాధ్యాయుల మధ్య తలెత్తిన వివాదం కారణంగా DEO శ్రీనివాస్ రెడ్డి సదరు హిందీ టీచర్‌ను దానంపల్లికి డిప్యూటేషన్‌పై పంపారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థులు.. తమకు ఇష్టమైన సార్‌ను ఉంచాలన్నారు.