పుంగనూరులో 96.52 % పెన్షన్ల పంపిణీ

పుంగనూరులో 96.52 % పెన్షన్ల పంపిణీ

CTR: పుంగనూరులో శనివారం మొదటి రోజే 96.52 % సామాజిక పింఛన్లు పంపిణీ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి తెలిపారు. 5371 మంది లబ్ధిదారులకు గాను మొదటి రోజే 5184 మందికి పెన్షన్లు అందినట్లు చెప్పారు. 187 మందికి పెన్షన్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. తమ అధికారుల సమన్వయ కృషితోనే నేటి సాయంత్రానికి 96.52 % పెన్షన్లు పంపిణీ చేయడం జరిగిందని కమిషనర్ అన్నారు.