బాలుడిపై వీధి కుక్కల దాడి
KDP: లింగాలలో ఓ బాలుడిపై వీధి కుక్కలు దాడి చేయగా, చిన్న గాయాలతో బయటపడ్డాడు. కుక్కల బెడద అధికంగా ఉందని అధికారులకు పలుమార్లు విన్నవించినా స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ, పశువైద్యాధికారులు, ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సంబంధిత అధికారులు కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.