ముసాయిదా జాబితా రైతు సేవా కేంద్రాల్లో ఏర్పాటు
PLD: పెదకూరపాడు రబీ 2025లో ఈ పంట సోషల్ ఆడిట్‌లో భాగంగా మండలంలోని అన్ని రైతు సేవాకేంద్రంలో ముసాయిదా జాబితా రైతుల సందర్శనార్ధం ఏర్పాటు చేశారని ఏవో కృష్ణయ్య తెలిపారు . ఈ పంట నమోదులో సవరణలు ఉన్నట్లయితే 14/03/2026 వరకు రైతు సోదరులు రైతు సేవా కేంద్ర సిబ్బందిని లిఖిత పూర్వక అర్జీతో సంప్రదించి సవరించుకోగలరని కోరారు.