హలో మాల చలో ఢిల్లీ కరపత్రాలు ఆవిష్కరణ
JN: జ్ఞాన యుద్ధంలో రాజకీయాలను గెలవలేని మనువాదుల కోరల నుంచి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని జాతీయ మాల మహానాడు కార్యదర్శి ఆశోద భాస్కర్ అన్నారు. శనివారం కొడకండ్లలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. హలో మాల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిస్తూ.. సంబంధిత కరపత్రాలను ఆవిష్కరించారు.