రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య

MNCL: మంచిర్యాలలోని రాజీవ్ నగర్‌కు చెందిన గాదె రాజేష్ అనే యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మంచిర్యాల - రవీంద్ర ఖని రైల్వే స్టేషన్ల మధ్య గుర్తుతెలియని రైలు ఢీకొనడంతో అక్కడిక్కడే మరణించాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. జీఆర్పీ ఎస్సై మహేందర్ ఆదేశాలతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని హెడ్ కానిస్టేబుల్ కెంసారం సంపత్ తెలిపారు.